రేవంత్ ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశం (Assembly Session) నుంచి బయటికి వచ్చిన కేటీఆర్.. మీడియా పాయింట్ లో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు (Congress Leaders) రాష్ట్ర బడ్జెట్ (State Budget) గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీ (Delhi)కి పంపే మూటల లెక్కలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
అలాగే ఖర్గే (Kharge), రాహుల్ (Rahul), ప్రియాంకగాంధీ (Priyanka Gandhi), కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ అయ్యారని, అందుకే అసెంబ్లీకి రాలేదని ఆరోపించారు. అంతేగాక బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ (BJP MLA Rajasingh) చేసిన కామెంట్స్ ను బీజేపీ నేతలు (BJP Leaders) ఎందుకు ఖండించటం లేదని, రాజాసింగ్ ను సస్పెండ్ (Suspend) చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. సోషల్ మీడియా అరెస్టుల గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని, అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు.
ఇక రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా అంటూ.. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసని, ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉదయ 5 గంటలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని చెప్పారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయని, పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసని హాట్ కామెంట్స్ చేశారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (Hyderabad Central University)లో ఆందోళన (Protest) అవుతుంటే.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.