సీఎం ఎలా పడుతున్నారో కానీ మేము తట్టుకోలేకపోతున్నాం.. సీపీఐ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి ఎలా పడుతున్నారో కానీ మేము మాత్రం తట్టుకోలేకపోతున్నామని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని సీపీఐ ఎమ్మెల్యే (CPI MLA) కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiva Rao) అన్నారు.

Update: 2025-03-15 10:58 GMT
సీఎం ఎలా పడుతున్నారో కానీ మేము తట్టుకోలేకపోతున్నాం.. సీపీఐ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెడ్ బెస్క్: ముఖ్యమంత్రి ఎలా పడుతున్నారో కానీ మేము మాత్రం తట్టుకోలేకపోతున్నామని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని సీపీఐ ఎమ్మెల్యే (CPI MLA) కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiva Rao) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం విమానాశ్రయం (Kothagudem Airport) ప్రతిపాదన కూడా ఎన్నో ఎళ్లుగా ఉన్నదని, కొత్తగూడెం, రామగుండంలో విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలించాలని కోరారు. అలాగే కొత్త విమానాశ్రయాలు రాకుండా ఎవరో కుట్ర ప్రన్నుతున్నారని తాను విన్నట్లు తెలిపారు. ఇక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరు చెప్పి కొందరు దుర్భాషలు ఆడుతున్నారని, ఇలాంటి దుర్భాషను ఎక్కడ నేర్చుకున్నారు.. పక్కనున్న ఏపీ నుంచి నేర్చుకున్నారా? అని మండిపడ్డారు.

ఇలాంటి భాష ఎవరు వాడినా తప్పేనని, రాజకీయ నాయకులు అంటే ఎన్ని తిట్టినా పడతారు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నేతలను ఎన్ని తిట్టినా ఏమి చేయలేరనే అలసత్వం పెరిగిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విద్వేషకరమైన భాషను మాట్లాడే పద్దతిని ఎక్కడున్నా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ఈ భాష లేదని, రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇది మొదలైందని తెలిపారు. దీని గురించి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, అందరి సలహాలు తీసుకొని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎలా పడుతున్నారో తెలియదు.. కానీ తమ మీద చిన్న ఆరోపణ వచ్చినా తట్టుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఒక్క రాజకీయ నాయకులలోనే కాదని, జర్నిలిజంలో కూడా ఉన్నదని, నా జీవితం కూడా జర్నలిజం నుంచి మొదలు అయ్యిందని, కానీ ఇలాంటి భాష వాడేవాళ్లం కాదని అన్నారు. ఈ సంస్కృతి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని, దీనికి రేవంత్ రెడ్డి సహా నాయకులు అందరూ ఒక రోజు సమయం కేటాయించి పరిష్కారం చూపించాలని కోరారు. అలాగే ప్రభుత్వం కేవలం రైతుల గురించే ఎక్కువ చేస్తున్నదని, కానీ చిన్న, కాంట్రాక్టు ఉద్యోగులపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తేదీనే వస్తున్నాయని, కానీ అది చిన్న ఉద్యోగులకు అందడం లేదని, వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దయచేసి వారికి కూడా సమయానికి జీతాలు అందజేసేలా చూడాలని కూనంనేని కోరారు.

Tags:    

Similar News