Sunkishala incident: కేటీఆర్ ఆరోపణలకు జలమండలి వివరణ

సుంకిశాల ఘటన(Sunkishala incident)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు జలమండలి అధికారులు బుధవారం వివరణ ఇచ్చారు.

Update: 2024-11-06 15:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుంకిశాల ఘటన(Sunkishala incident)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు జలమండలి అధికారులు బుధవారం వివరణ ఇచ్చారు. కేటీఆర్(KTR) చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఖండించారు. సుంకిశాల ప్రాజెక్టు(unkishala Project) గోడ కూలడంపై విచారణ కమిటీ వేసినట్లు తెలిపారు. విచారణ కమిటీ సైతం నివేదిక సమర్పించిందని గుర్తుచేశారు. కాంట్రాక్టర్ నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేదని వెల్లడించారు. కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని కమిటీ సూచించిందని.. సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణకు కమిటీ సిఫారసు చేసిందనీ వెల్లడించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా విచారించింది. విచారణ తర్వాత తదుపరి చర్చలు ఉంటాయని అన్నారు. మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపునకే గోదావరి ఫేజ్-2 పథకం అని పేర్కొన్నారు. రూ.1100 కోట్లతో కొండ పోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు జలమండలి ఇప్పటివరకు ఎలాంటి అంచనాలు రూపొందించలేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News