Minister Talasani: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే వార్డ్ ఆఫీసులు...

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ప్రజల సౌకర్యార్థం వార్డ్ ఆఫీసులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి

Update: 2023-07-07 06:19 GMT

దిశ, సిటీ బ్యూరో: ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ప్రజల సౌకర్యార్థం వార్డ్ ఆఫీసులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన అమీర్పేట్‌లోని శ్రీరామ్ నగర్‌లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు వార్డ్ ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం వార్డ్ ఆఫీస్ సేవలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గడిచిన 50, 60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలో జరిగిందని వివరించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..