ఎటువంటి అనుమతి లేకుండా… యథేచ్ఛగా మట్టి తోలకాలు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లో గత కొన్ని రోజులుగా ఎటువంటి అనుమతి లేకుండా జెసిబి లతో ట్రిప్పర్, లారీలో మట్టి నింపుతూ కొంత మంది క్యాష్ చేసుకుంటున్నారు.

Update: 2024-10-24 09:52 GMT

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లో గత కొన్ని రోజులుగా ఎటువంటి అనుమతి లేకుండా జెసిబి లతో ట్రిప్పర్, లారీలో మట్టి నింపుతూ కొంత మంది క్యాష్ చేసుకుంటున్నారు. మట్టి తోలకాలు నిర్వహించాలంటే పట్టా భూమి యజమాని, స్థానిక రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి పొంది తోలకాలు నిర్వహించాలి. ఏ శాఖ అధికారుల అనుమతి లేకుండా మండల కేంద్రంలోని చర్లపల్లి పంచాయతీ పరిధిలో రామచంద్రాపురం రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే రైతు పట్టా భూమిలో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. టిప్పర్ మట్టి లోడ్ మూడు నుంచి నాలుగు వేల రూపాయలకు ఇంటి నిర్మాణం, రియల్ ఎస్టేట్ భూములకు తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. దీనిపై తహశీల్దార్ బి.విజయ ను వివరణ కోరగా మట్టి అనుమతులు మీము ఇవ్వలేదని, ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా తీసుకోవాలని బదులిచ్చారు. అనంతరం సైట్ వద్దకు వచ్చి పరిశీలించారు.


Similar News