కాంగ్రెస్ అధికాంలోకి రాగానే రెండు లక్షల రుణ మాఫీ చేస్తాం.. దొంతి మాధవరెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.

Update: 2023-11-11 13:31 GMT

దిశ, చెన్నారావుపేట : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాత మగ్ధుంపూరం గ్రామానికి చెందిన 60 కుటుంబాలు శనివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దొంతి మాధవరెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఏకకాలంలో 2 లక్షల ఋణమాఫీ చేస్తామని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ననుమస కర్ణకర్, పోలేపెల్లి బిక్షపతి, బొంత శ్రీనివాస్, చిట్టే రవి, గండ్ల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News