ఎస్సై బలవన్మరణానికిి కారణం ఏంటీ…ఘటన స్థలంలో ఉన్న మహిళ ఎవరు..?
ములుగు జిల్లా వాజేడు మండల ఎస్సై గా వీధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్(30) సోమవారం రోజున ఉదయం 6ః30 నుండి 7 గంటల సమయంలో వాజేడు
దిశ,ఏటూరునాగారంః- ములుగు జిల్లా వాజేడు మండల ఎస్సై గా వీధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్(30) సోమవారం రోజున ఉదయం 6ః30 నుండి 7 గంటల సమయంలో వాజేడు మండలం పూసురు గ్రామ సమీపాన గల పేరిడో రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎస్సై ఆత్మహత్య చేసుకున్న పేరిడో రిసార్ట్ గదిలో అదే సమయంలో ఒక మహిళ ఉండడం, ఆ మహిళ ఎస్సై హరీష్ మృత దేహం పై రోదిస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఎస్సై బలన్మారణానికి అ మహిళే కారణమా..? వారిద్దరి మధ్య ఉన్న సంభందం ఏంటీ..? ఆయన అత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ఒక్కరే ఉండడం పై, వీరిద్దరి మధ్య ఏలాంటి ఘర్షణ జరిగి ఉంటుందో అనే అనుమానాలు స్థానికంగా వెలువడుతున్నాయి.
వ్యక్తి గత కారణాలే ఆత్మహత్యకు కారణం.. జిల్లా ఎస్పీ శబరీష్..
వాజేడు ఎస్సై రుద్రరాపు హరీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థలానికి ములుగు జిల్లా ఎస్పీ శభరీష్ ఉదయం 11ః50 గం..సమయంలో చేరుకుని వెంకటాపురం సీఐ బండారి కూమార్ తో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఎస్సై హరీష్ మృతదేహన్ని పరిశీలించారు. అనంతరం మీడీయాతో మాట్లడుతూ ఎస్సై రుద్రారపు హరీష్ వ్యక్తి గత కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ ఘటన పై సమగ్ర విచారణ జరిపి నిజనిజాలు త్వరలోనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం ఎస్సై హరీష్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ములుగు ఏరియా అసుపత్రికి తరలించారు.
ఎస్సై హరీష్ నిర్వహించిన వీధులు..
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్సై రుద్రారపు హరీష్..ఎస్సైగా ఎంపీకైన మొదటి సారి వాజేడు ట్రైనీ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. కొద్ది నెలలు వాజేడు మండలంలో వీధులు నిర్వహించిన ఎస్సై హరీష్ మండల పరిదిలోని పేరూర్ ఎస్సైగా 29-10-2022 లో బాధ్యతలు స్వీకరించారు. అక్కడ సంవత్సరం పాటు వీధులు నిర్వహించి ములుగు వీఆర్‌కు బదిలీ అయ్యారు. తర్వాత వాజేడు ఎస్సైగా 2024 జూన్ 17న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి నేటి వరకు మండల ప్రజలతో మమేకమే ఫ్రెండ్లీ పోలిస్ విధానాన్ని పెంపోదిస్తూ ప్రజలకు సేవలు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఎస్సై హరీష్ రేగొండ మండలం వెంకటేశ్వారాల పల్లీ చెందిన వారు, ఎస్సై హరీష్ కు తల్లీ తండ్రులు రుద్రారపు రాములు, రుద్రారపు మల్లీకాంబ, ఒక అన్నయ,చెల్లీ ఉన్నారు. ఎస్సై ఆత్మహత్య వార్తతో వాజేడు మండలంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.