పండ్లు కూరగాయల వ్యాపారులతో ఎమ్మెల్యే రేవూరి..సమావేశం !

చిరు వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-02 15:11 GMT

దిశ, పరకాల : చిరు వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండ్లు, కూరగాయల వ్యాపారస్తులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సమావేశాన్ని నిర్వహించారు. పలు సమస్యలను చిరు వ్యాపారస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ… మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మిగిలిపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.

ప్రతి ఒక్కరు లైసెన్స్ తో వ్యాపారం చేయాలని, రోడ్ల పై వ్యాపారం చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, నిబంధనలను ప్రకారం వ్యాపారం చేయాలని తెలిపారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, లైటింగ్ సిస్టం ను ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం వ్యాపారస్థులు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న మార్కెట్ వినియోగదారులకు అందుబాటులో ఉందని, మరొక ప్రదేశానికి తరలించరాదని ఎమ్మెల్యేని వ్యాపారస్తులు కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్,ఏ యం సి చైర్మన్ రాయిడి జీవన్ రెడ్డి,కౌన్సిలర్లు పార్టీ నాయకులు, పండ్లు కూరగాయలకు సంబంధించిన వ్యాపారాలు పాల్గొన్నారు.


Similar News