బావిలో పడి బాలిక మృతి
కేసముద్రం మండలం బేరువాడ బోడ మంచ్యా తండాకి చెందిన బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
దిశ,కేసముద్రం : కేసముద్రం మండలం బేరువాడ బోడ మంచ్యా తండాకి చెందిన బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సంఘటన స్థలాన్ని చేరుకున్న ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బోడ దేవి- లాలియా ల కూతురు శ్రావణి(14) వారి ఇంటికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్ద ప్రమాదవశాత్తు బావిలో జారి పడి మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళీధర్ రాజు తెలిపారు.