భర్తను హతమార్చిన భార్య

భార్య భర్తను చంపిన సంఘటన మండలంలోని మక్తక్యాసారంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2024-12-02 15:43 GMT

దిశ, మునిపల్లి : భార్య భర్తను చంపిన సంఘటన మండలంలోని మక్తక్యాసారంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మక్త క్యాసారం గ్రామానికి చెందిన మంజుల శంషాబాద్ హైదరాబాద్ కు చెందిన సంపత్ తో గత 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత ఏడాది నుంచి సంపత్ మంజుల మధ్య తరచు కుటుంబ కలహాలతో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఎస్సై తెలిపారు. భార్య భర్త మధ్య గొడవలు జరగడంతో పలుమర్లు పెద్దలు పంచాయితీలు పెట్టి నచ్చచేప్పిన గొడవలు తగ్గకపోవడంతో మంజుల భర్తతో కొట్లాడి తల్లి గారి ఇంటి దగ్గరే ఉంటుంది.

అప్పటి నుంచి భర్త సంపత్ భార్యను చూసి వెళ్ళేందుకు అప్పుడప్పుడు వచ్చిపోయేవాడనీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పటిలాగే గత పది రోజుల క్రితం సంపత్ అత్తగారింటికి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. ఆదివారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగిన సందర్భంలో భార్య మంజుల భర్త సంపత్ ను కర్రతో బలంగా కొట్టి, ఇంట్లో నుంచి బయటకు తోసేయడంతో సంపత్ అరుబయట ఉన్న ఓ బండపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని కొండాపూర్ సీఐ వెంకటేశం సందర్శించి వివరాలు సేకరించారు.


Similar News