రోహిణి హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలుడు మృతి..

వరంగల్ జిల్లా రామన్న పేట తండా కు చెందిన తరుణ్ అనే బాలుడు హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో మృతిచెందాడు

Update: 2024-12-02 16:18 GMT

దిశ, హనుమకొండ : వరంగల్ జిల్లా రామన్న పేట తండా కు చెందిన తరుణ్ అనే బాలుడు హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో మృతిచెందాడు. నెక్కొండ రోడ్డు ప్రమాదం లో తండ్రి కొడుకు లకు తీవ్రంగా గాయలుకగా బాలుడిని హనుమకొండ లోని రోహిణి హాస్పటల్ లో జాయిన్ చేశారు. బాలుడికి వైద్యం చేయకుండా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బంధువుల ధర్నా కు దిగారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.


Similar News