వరంగల్ బల్దియా బడ్జెట్ రూ.612 కోట్లు..
వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2023-24 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది.
దిశ, వరంగల్ టౌన్: వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2023-24 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది. రూ.612 కోట్ల 29లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో రూ.213 కోట్ల 63 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.394 కోట్ల 16 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.