తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా : ఎమ్మెల్యే రేవూరి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
దిశ, హనుమకొండ ( పరకాల ) : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావులు మాట్లాడుతూ... టెక్స్టైల్ పార్క్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రోకర్ల లాగా వ్యవహరించారని, రైతుల భూముల విషయంలో నిలువునా ముంచారని తెలిపారు. టెక్స్టైల్ పార్క్ కోసం భూములు తీసుకున్న రైతులకు చేసింది ఏం లేదని రియల్ ఎస్టేట్ బ్రోకర్లగా పని చేశారని అన్నారు. సుమారు రూ. 400 కోట్లు దోచుకున్నారని అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి ఏమి లేదని అందిందల్ల దోచుకుతిన్నారని తెలిపారు.
అభివృద్ధి పేరిట దోచుకున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించి తన స్వలాభం కోసం నియోజకవర్గాన్ని దోచుకున్నారని అన్నారు. సీఎంఆర్ నిధులు, ఫోర్జరీ సంతకాలు చేసి దోచుకున్న మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అడిగిన వెంటనే పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట వరకు 65 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్స్టైల్ పార్కులో భూముల కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని, టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషిచేసి, భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 863 ఇందిరమ్మ ఇల్లు 43 కోట్ల 51 లక్షల విలువ గల రూపాయలు, టెక్స్టైల్ పార్కులో వసతుల కల్పన, గ్రామస్థాయిలో అభివృద్ధికి కృషి, రోడ్లు, డ్రైనేజీ,నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
పెద్దపెల్లి ఎమ్మెల్యే శ్రీ విజయ రమణ రావు మాట్లాడుతూ.. రేపు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో జరిగే ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేలా పరకాల నియోజకవర్గం నుంచి 20 వేల మందిని తరలించేందుకు గ్రామ స్థాయి నుంచి సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా,చెప్పని వాటిని కూడా అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తున్నా సందర్భంగా ముందుగానే వరంగల్ జిల్లాలో సీఎం ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.