గుప్త నిధుల కోసం మైసమ్మ విగ్రహం ధ్వంసం

కాకతీయుల నాటి బయ్యారం చెరువు కట్టపై గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 15 శుక్రవారం అర్ధరాత్రి మైసమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయటం

Update: 2024-11-18 09:44 GMT

దిశ,బయ్యారం : కాకతీయుల నాటి బయ్యారం చెరువు కట్టపై గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 15 శుక్రవారం అర్ధరాత్రి మైసమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఈ ప్రాంత భక్తులకు చాలా బాధాకర విషయమని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. ఎంతో ప్రాముఖ్యత ,మహిమ కలిగిన చెరువు కట్టపై మైసమ్మ తల్లి విగ్రహాన్ని గుప్త నిధులు కోసం తవ్విన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించి ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకతో చుట్టు పక్కల కటగడ్డ ,కొత్తపేట ,కొత్తగూడెం, ఇర్సులాపురం ,బయ్యారం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన ప్రాంతానికి తరలివచ్చారు. ఆధ్యాత్మిక తో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే మైసమ్మ తల్లి గుప్తనిధులు తస్కరించిన దొంగలను పట్టుకొని , పోలీసులు ప్రజలకు అప్ప చెప్పాలని, వారిని కట్టపైన శిక్షించాలని మండిచేశారు. మైసమ్మ తల్లి వారిని చంపేదాకా వదలదని అంతటి మహిమ గల తల్లి మైసమ్మ అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భక్తులు, ప్రజలు, ఈ ప్రాంత వాసులు ఎవరు అధైర్య పడొద్దని,ముందు జరగబోయే కార్యక్రమం గుడి పునః నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తామని, రైతులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు దాతల సహాయంతో స్వామీజీ ల సహకారం తీసుకొని పెద్ద ఎత్తున మైసమ్మ తల్లి పునః ప్రతిష్ట చేసుకుందామని పిలుపునిచ్చారు. మండలంలో ప్రజలకు కావలసిన మేజర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అక్కడే ఉన్న స్థానికులు, రైతులు బయ్యారం పెద్ద చెరువులో పూడిక ,అలుగు, కట్ట ఎత్తు పెంచి,కాలువల పక్కా మరమ్మతులు చేయాలని, చెరువులో ఎక్కువ నీరు నిల్వ ఉండే చర్యలు సీతారామ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ నుండి బయ్యారం చెరువుకు నీటిని తరలించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే కు స్థానికులు విన్నవించారు. దీనికి ఎమ్మెల్యే పూర్తి సహకారం అందిస్తానని రైతులకు, నాయకులకు హామీ ఇచ్చారు.

రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం

మండలంలో కొత్తపేటలో, నామాలపాడు గ్రామాల్లో సోసైటి ,ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దళారి వ్యాపారులకు ధాన్యం అమ్మి నష్ట పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కేంద్రంలో విక్రయం చేసుకోవాలని,సన్న ధాన్యం పండించిన ప్రతి రైతు 500 రూపాయలు బోనస్ తీసుకొని లాభం పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ కృష్ణ, ఏఇ పృద్వి , సొసైటీ అధ్యక్షుడు మధుకర్ రెడ్డి ,డైరెక్టర్ లు సీతారాం రెడ్డి, శ్రీనివాస్, ఏఓ రాంజీ, ఎమ్ పిడిఓ విజయలక్ష్మి, ఐకెపి ఏపీఓ నరసింహారావు ,సిసి లు అలీ, ఐకెపి వివో నాగమణి, నాయకులు ప్రవీణ్ నాయక్, వీరభద్రం, అన్నపూర్ణ ,రాంచంద్రయ్య, వెంకట్రావు, కిషన్ నాయక్, శ్రీనివాసరెడ్డి, ముసలయ్య, వెంకన్న, నాగేశ్వరరావు, వెంకటపతి, మహిళా భక్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Similar News