నూతన మున్సిపాలిటీతో మారిన వర్దన్నపేట రూపురేఖలు : ఆరూరి రమేష్
నూతన మున్సిపాలిటీతో వర్థన్నపేట రూపురేఖలు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు.
దిశ, వర్ధన్నపేట : నూతన మున్సిపాలిటీతో వర్థన్నపేట రూపురేఖలు మారాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. శనివారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా, డీసి తండా, గుబ్బేటి తండా, కోనాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి రావడన్ని అడ్డుకోలేరని వెల్లడించారు.
వర్దన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో వర్దన్నపేట మున్సిపాలిటీని 239 కోట్ల 81 లక్షల 79వేల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వర్దన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే కాకుండా ప్రతీ గడపకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, జిల్లా రైతు బందు కో ఆర్డినేటర్ లలితా యాదవ్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.