భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం : పాలకుర్తి ఎమ్మెల్యే

భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి

Update: 2024-12-21 09:16 GMT

దిశ, పెద్దవంగర : భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి పేర్కొన్నారు.శనివారం మండల కేంద్రంలోని పోచంపల్లి గ్రామంలో దేవాదుల ప్యాకేజీ (6) కింద భూములు కోల్పోయిన 250 మందికి రూ.11 కోట్ల 40 లక్షల చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యాకేజ్ ద్వారా భూ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి జీవనోన్నతికి అవసరమైన సహాయ సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రగతి దిశగా ముందడుగు వేయిస్తాయని,ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవన ఉపాధితో పాటు నష్టపోకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.

భూమి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా కొత్త జీవనశైలిని ఏర్పరచుకునే అవకాశం కల్పించడం,సమగ్ర పునరావాస పథకాలు అందించడం జరుగుతుందన్నారు.ఈ ప్యాకేజ్ (6) ద్వారా భూ నిర్వాసితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక కార్యక్రమం న్యాయబద్ధత తో కూడిన అభివృద్ధి పునాది వేస్తుందని ఆమె స్పష్టం చేశారు.. భూ నిర్వాసితుల కష్టాలను పరిష్కరించడంలో కీలక భూమిక పోషిస్తుందని, నిధుల పంపిణీ సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ పథకం విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరి సహకారం ముఖ్యమని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయపడతామని హామీ ఇచ్చారు. భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ అసలు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి, తొర్రూరు RDO, ఇరిగేషన్ సీతారాం, కృష్ణ ప్రసాద్,ఎంపీడీఓ వేణుమాధవ్,బ్లాక్ అధ్యక్షుడు హమ్యా నాయక్, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ధరావత్ సురేష్ నాయక్, సంచు సంతోష్, సీనియర్ నాయకులు గంజి విజయ్ పాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రంగు మురళి, డైరెక్టర్లు మన్మోహన్ రెడ్డి, పూర్ణ చందర్, గోపాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాసాల ప్రభాకర్, వేణు, రాజు, సోము నాయక్, సమయ్య, యువజన నాయకులు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.


Similar News