హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్.. మాజీ ఎమ్మెల్యే

రేవంత్ రెడ్డి సర్కార్ హామీల అమలులో ఫెయిల్ అయిందని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ పై కక్షపూరితంగా ఈ ఫార్ములా రేస్ కేస్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రకు తెరలేపారని డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు.

Update: 2024-12-21 02:55 GMT

దిశ, మరిపెడ : రేవంత్ రెడ్డి సర్కార్ హామీల అమలులో ఫెయిల్ అయిందని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ పై కక్షపూరితంగా ఈ ఫార్ములా రేస్ కేస్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రకు తెరలేపారని డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెడ్యా మాట్లాడుతూ ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని అన్నారు. హామీలు అమలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోనే కేటీఆర్ పైన కేసులు పెట్టారని అన్నారు.

ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రేనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యవహారం పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని, కేటీఆర్ పట్టు పట్టినప్పటికీ ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ పెట్టడం లేదో చెప్పాలి అని ప్రభుత్వాన్ని రెడ్యా ప్రశ్నించారు. లగ్గచర్లలో తన అల్లుడు కొరకు మూడు వేల ఎకరాల భూములు కావాలనే ఉద్దేశంతో దళితుల భూములు లాక్కునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఫెయిల్ అయ్యారని, అలాగే రుణమాఫీ, హైడ్రా, మూసి సుందరీకరణ, మహిళలకు 2500 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News