seize : రెండు జేసీబీలు ఒక ట్రిప్పర్ లారీ సీజ్
అక్రమంగా మొరం ఇసుక తవ్వకాలు చేపట్టితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ప్రస్తం శ్రీనివాస్ అన్నారు.
దిశ, వర్థన్నపేట : అక్రమంగా మొరం ఇసుక తవ్వకాలు చేపట్టితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ప్రస్తం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని లింగమోరి గూడెం,పున్నెలు గ్రామ శివారులోని వడ్డెర గూడెం గ్రామాలకు చెందిన వారు 100 డయల్ కాల్ చేసి ఇసుక మొరం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి
దిగి ఇసుక, మొరంను తరలింపునకు ఉపయోగించిన రెండు జేసీబీలను ఒక టిప్పర్ లారీని సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 100 డయల్ సమాచారానికి పోలీసు అధికారులు స్పందించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే 100 డయల్ కు స్పందించి కేసు నమోదు చేయడం పట్ల రెండు గ్రామాల ప్రజలు పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.