సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి : హరికోట్ల రవి
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అములు చేస్తున్న సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని టీఎస్ సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షులు హరికోట్ల రవి డిమాండ్ చేశారు.
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అములు చేస్తున్న సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని టీఎస్ సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షులు హరికోట్ల రవి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం కాంట్రీబ్యూటరీ స్కీం పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలంటూ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్ల కార్డులు చేతపట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. 2004 తర్వాత విధుల్లో చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వాలు మితిమీరిన జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఈ ర్యాలీలో పలు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.