పొలిటికల్ ప్రమోషన్స్, సోషల్ మీడియా యూసేజ్ పై శిక్షణ..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ తమ క్రియాశీల కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం చేపట్టారు.
దిశ, నర్సంపేట : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ తమ క్రియాశీల కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట పట్టణం పద్మశాలి గార్డెన్స్ లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నర్సంపేట నియోజకవర్గ యూత్ & సోషల్ మీడియా వారియర్స్ కొరకు అనుభవజ్ఞులైన నిపుణులచే శిక్షణ తరగతులను నిర్వహించారు. అధికార పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేసే విధానంలో పాటించాల్సిన మెలకువలు దానికి సంబంధించిన నైపుణ్యతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ ద్వారా సవివరంగా స్టేట్ సోషల్ మీడియా బృందం బోధించారు.
ఇందులో భాగంగా ప్రతిపక్షాలు ఫేక్ వార్తల క్రియేషన్స్ ద్వారా ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తూ, ప్రజలను ఏ విధంగా తప్పుద్రోవ పట్టిస్తున్నారో స్పష్టంగా వివరించారు. సరైన విషయ పరిజ్ఞానంతో ప్రతిపక్షాలకు కౌంటర్ వేసే విధానంతో పాటు ప్రమోట్ చేయదలచుకున్న అంశం ఎక్కువ మందికి చేరేందుకు సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ ను వివరించారు. నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుండి దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొన్న కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా పొలిటికల్ ప్రమోషన్స్ & సోషల్ మీడియా యూసేజ్ పై సవివరంగా శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతి కొరకు నిర్విరామంగా కృషి చేస్తూ ప్రభుత్వం చేసే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోషల్ మీడియా వారియర్స్ కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.