వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దొంగల హల్చల్...

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రతి రోజు ఉద్యోగులు అటెండెన్స్ వేసే బయోమెట్రిక్ మిషన్ ఎత్తుకెళ్లారు.

Update: 2024-10-22 16:27 GMT

దిశ, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రతి రోజు ఉద్యోగులు అటెండెన్స్ వేసే బయోమెట్రిక్ మిషన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ విషయం పై ఆస్పత్రి ఉన్నతాధికారులు స్థానిక మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మట్టేవాడ పోలీసులు సీసీ ఫుటేజ్ లను పరిశీలిచి దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితమే రెండు ద్విచక్ర వాహనాలను దొంగిలించబడ్డాయని, అందులో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం ఎత్తుకెళ్ళుతుండగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయని  ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో దొంగలు ఇలా చేయడం గమనార్హం.


Similar News