యువకుడ్ని బలిగొన్న ప్రభుత్వ ఉద్యోగం.. కన్నీళ్లు తెప్పిస్తోన్న సూసైడ్ నోట్

తెలంగాణలో నిరుద్యోగుల, రైతన్నల చావులు కలకలం రేపుతున్నాయి. ఊరుకు, కుటుంబానికి దూరంగా ఉంటూ.. పండగలు.. పబ్బాలు.. చుట్టాలతో పలకరింపులు.. ఎలాంటి సంబరాలు చేసుకోకుండా ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటూ నిరుద్యోగులు సిటీలో కష్టపడి చదువుకుంటున్నారు.

Update: 2024-07-05 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిరుద్యోగుల, రైతన్నల చావులు కలకలం రేపుతున్నాయి. ఊరుకు, కుటుంబానికి దూరంగా ఉంటూ.. పండగలు.. పబ్బాలు.. చుట్టాలతో పలకరింపులు.. ఎలాంటి సంబరాలు చేసుకోకుండా ఒక పూట తింటూ ఒక పూట ఉపవాసం ఉంటూ నిరుద్యోగులు సిటీలో కష్టపడి చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఉద్యోగం రాకపోవడంతో, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన రంజిత్ పలుపోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. 2 రోజుల కిందట కడపలోని స్నేహితుడు ప్రశాంత్ రెడ్డి అక్క పెళ్లికి వచ్చాడు. లాడ్జిలో స్నేహితులతో కలిసి బస చేశాడు. ఫ్రెండ్స్‌తో రాత్రంతా జాలిగా గడిపినా రంజిత్‌కు ఒక్కసారిగా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేదని ఆలోచన మైండ్‌లో తట్టింది. తీవ్ర మనస్తాపానికి చెందిన రంజిత్.. ‘అమ్మ నాన్న మీ కోరిక మేరకు నేను ఉద్యోగం తెచ్చుకోలేకపోయాను. ఉద్యోగం వస్తదేమోనని ఎంతో ఆశగా ఎదురుచూశా. నా చావుకు నిరుద్యోగమే కారణం. నాకు చనిపోవడం ఒకటే దారి అని అనిపించింది. నన్ను క్షమించండి అమ్మ-నాన్న’ అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. 


Similar News