పది నాణెం.. వద్దు అనొద్దు.. ఇండియన్ బ్యాంక్ మేనేజర్

పది రూపాయల నాణెం చెల్లదనే అపోహలు నమ్మ వద్దని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేష్ సోమవారం పది రూపాయల నాణెం.. వద్దు అనొద్దు..

Update: 2024-10-21 15:56 GMT

దిశ, కొత్తగూడ: పది రూపాయల నాణెం చెల్లదనే అపోహలు నమ్మ వద్దని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేష్ సోమవారం పది రూపాయల నాణెం.. వద్దు అనొద్దు.. అనే కార్యక్రమం పై ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేష్ ఆధ్వర్యంలో కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రజలతో, షాప్ లలోకి వెళ్లి ప్రతి ఒక్కరికి పది రూపాయల నాణెం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ నరేష్ మాట్లాడుతూ పది రూపాయల నాణేలు చట్టబద్ధమైనవి అని మన రోజు వారి లావాదేవీలకు పది రూపాయల నాణేలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బ్యాంకు సిబ్బంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News