అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం పట్టివేత..

అక్రమంగా పీడీఎస్ బియ్యం నిలువ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పౌల్ట్రీ ఫారం పై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Update: 2024-10-20 09:45 GMT

దిశ, గీసుగొండ : అక్రమంగా పీడీఎస్ బియ్యం నిలువ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పౌల్ట్రీ ఫారం పై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొనాయిమాకుల గ్రామంలో చిట్టిరెడ్డి జీవన్ రెడ్డి సంతోషిమాత పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తున్నారు. అక్కడ సుమారు 37,500/- రూపాయల విలువగల 15 క్వింటాళ్ల బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గీసుగొండ పరిసర గ్రామాల నుండి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి అతని పౌల్ట్రీ ఫారంలో నిల్వచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం గీసుగొండ పోలీసులకు అప్పగించారు.


Similar News