విద్యార్థులు చదువు, ఆటలలో రాణించాలి: కలెక్టర్ ప్రావీణ్య

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని

Update: 2024-09-13 12:40 GMT

దిశ,కమలాపూర్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, క్రీడల్లో రాణించాలని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలలో గురువారం రాత్రి బస చేసిన కలెక్టర్ ప్రావీణ్య విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం శుక్రవారం ఉదయం విద్యార్థులతో కలిసి విద్యార్థుల రోజు వారి భాగంలో రన్నింగ్,వార్మ్ ప్, మెడిటేషన్ చేసి తదుపరి వాలీబాల్, షెటిల్ ఆటలు ఆడారు. పిదప పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహారంలో భాగంగా విద్యార్థులతో కలిసి రాగిజావ,టిఫిన్ సేవించారు. డైనింగ్ హాల్ కు సంబంధించిన రిజిస్టర్స్, ఫుడ్ మెనూ రిజిస్టర్, మెడికల్ రిజిస్ట్రర్స్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.

కలెక్టర్ పిల్లలతో ఫ్రెండ్లీగా కలిసి పిల్లలు కష్టపడి చదివి ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన పుస్తకాలు, దుస్తులు, రోజువారి అల్పాహార,భోజనం మెనూ సక్రమంగా అందుతుందో పిల్లల్ని అడిగి తెలుసుకున్ననన్నారు. పిల్లలకు పాఠశాలకు సంబంధించిన దుస్తులు, పుస్తకాలు, మంచి విద్య అందుతున్నాయని,మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందుతుందన్నారు.పిల్లలు పాఠశాల ప్రహరీ గోడ, తరగతి గది,డైనింగ్ హాల్ బల్లల సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని త్వరలోనే వాటిని అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సౌజన్య,ఫిజికల్ డైరెక్టర్ క్రిష్ణవేణి, పి.ఇ.టి.సంగీత, విద్యార్థులు పాల్గొన్నారు.


Similar News