భూపాల్ పల్లికి ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తా : కేసీఆర్

రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడు, మళ్ళీ వెంకటరమణారెడ్డిని గెలిపించి పంపించండి 24 గంటల విద్యుత్ ఇలాగే కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2023-11-24 16:18 GMT

దిశ, భూపాలపల్లి : రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడు, మళ్ళీ వెంకటరమణారెడ్డిని గెలిపించి పంపించండి 24 గంటల విద్యుత్ ఇలాగే కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రజాఆశీర్వాద సభలో భూపాల్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూపాలపల్లికి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి తీసిబంగాళాఖాతంలో వేస్తారంట విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించాలని అన్నారు. భూపాల్ పల్లి నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి, ఎవరు నిలుచుంటే ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి జరుగుతుందో, ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

బీఆర్ఎస్ చరిత్ర మీకు తెలుసు మీ కళ్ళముందే పుట్టిన ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రప్రజల హక్కులను పరిరక్షించుకునేందుకు తెలంగాణ అభివృద్ధి చేసేందుకే మీ ముందుకు వచ్చిందని ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ రాజీలేని పోరాటం అనంతరం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఆ తర్వాత అనేక రంగాల్లో మంచి పనులు చేసుకుని గతంలో ప్రధాన సమస్యలుగా ఉన్న మంచినీటి సమస్యలను తీర్చుకున్నామని వైఎస్సార్ రంగాన్ని గతంలో కంటే మెరుగ్గా బాగు చేసుకున్నామని పేదల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకున్నామని అన్నారు. రమణారెడ్డిని గెలిపించి తిరిగి అసెంబ్లీకి పంపిస్తే ఆసరా పెన్షన్ 5000 వరకు పెరుగుతాయని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతుబంధు పుట్టించింది కేసీఆర్ అని, రైతు మరణించిన వారం రోజులలోపే ఐదు లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రేవంత్ రెడ్డి అంటున్న మాటలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచించి గండ వెంకటరమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News