కాళేశ్వరం ఆలయంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రత్యేక పూజలు..
దేశంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గల శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల దర్శించుకున్నారు.
దిశ, కాటారం (కాళేశ్వరం): దేశంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గల శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల దర్శించుకున్నారు. కాళేశ్వరంలోని ప్రధాన ఆలయ ద్వారం వద్ద కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వెల్ది శ్యామ్ శర్మ, పనకంటి పవన్ శర్మ లి ప్రధాన ఆలయంలో గల శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి మంత్రి పురుషోత్తం రూపాలచే అభిషేకం నిర్వహించారు.
కాళేశ్వరంలో గల పార్వతి దేవి, సరస్వతీ దేవి ఆలయాలను సందర్శించారు. వేద బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారు. దేవాలయ ధర్మకర్తలు అడుప సమ్మయ్, కామిడి రాంరెడ్డి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శాలువాలతో సత్కరించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాన్ని మంత్రికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.