మాకు ప్రొటెక్షన్ కల్పించండి.. సొసైటీ డైరెక్టర్ల వేడుకోలు..

అవిశ్వాస తీర్మానం పై రేపు జరగబోయే సమావేశానికి వచ్చే విధంగా సహకరించాలని చౌటపల్లి పీఏసీఎస్ సొసైటీ డైరెక్టర్లు పోలీసు అధికారులను, మీడియా మిత్రులను కోరారు.

Update: 2024-11-19 07:14 GMT

దిశ, పర్వతగిరి : అవిశ్వాస తీర్మానం పై రేపు జరగబోయే సమావేశానికి వచ్చే విధంగా సహకరించాలని చౌటపల్లి పీఏసీఎస్ సొసైటీ డైరెక్టర్లు పోలీసు అధికారులను, మీడియా మిత్రులను కోరారు. ఇటీవల చౌటపల్లి సొసైటీలో భారీ అక్రమాలు జరిగాయని చైర్మన్ వైస్ చైర్మన్ రైతుల దగ్గర నుండి క్రాఫ్ లోన్ ల కోసం డబ్బులు వసూలు చేశారని, పీఏసీఎస్ భవన, గోదాముల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణ చేస్తు అవిశ్వాస తీర్మానం కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు రేపు 20వ తేదీన చౌటపల్లి పీఎసీఎస్ లో అందరూ హాజరు కావాలని డైరెక్టర్లకు తెలిపారు. అయితే స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారని, అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకుంటామని తమపై దాడి చేస్తామని తెలుపడంతో... డైరెక్టర్లు అందరు కలిసి పక్క రాష్ట్రానికి క్యాంపునకు వెళ్లి రేపు తిరిగి రానున్నారు. వచ్చాక ఎక్కడ అడ్డుకుంటారో డైరెక్టర్ల పై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతూ స్థానిక ఎస్సై, సీఐ, ఏసీపీ, సీపీ అధికారులు తమకు ప్రొటెక్షన్ కల్పించాలని, అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు సహకరించాలని కోరిన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశాన్ని విలేకరులకు, సోషల్ మీడియాలో పంపించారు.


Similar News