సీఎం పర్యటనకు వ్యతిరేకంగా నిరసన..

కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలను పెట్టకుండా, కళాకారుల పేరుతో నామకరణం చేయకుండా కళాక్షేత్రం ఆవిష్కరణ చేయొద్ద

Update: 2024-11-19 09:21 GMT

దిశ, హనుమకొండ : కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలను పెట్టకుండా, కళాకారుల పేరుతో నామకరణం చేయకుండా కళాక్షేత్రం ఆవిష్కరణ చేయొద్దని, మంగళవారం రేవంత్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ ధర్నా నిర్వహిస్తుండగా తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునిల్, సౌత్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్,ఇతర విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కళాకారులకు న్యాయం జరిగేంత వరకు, వారి త్యాగానికి గౌరవం లభించేంతవరకు ఉద్యమం ఆగదని, కళాకారుల విగ్రహాలు పెట్టేంతవరకు పోరాడుతామని హెచ్చరించారు. కళాక్షేత్రానికి కాళోజీ పేరు పెట్టడం, కళాకారులను అవమానించడమేనన్నారు. ఇది కుల వివక్షకు నిదర్శనమన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎస్ఐఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్,తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్,నాగారం మణితేజ టీ ఎస్ ఎఫ్ ,గ్రేటర్ వరంగల్ సిటీ ప్రెసిడెంట్ , శివ,సిద్దు, జరిపోతుల వంశీ కృష్ణ టీ ఎస్ ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


Similar News