ఎస్‌బీఐలో భారీ చోరీ.. ప‌ది కోట్ల విలువ చేసే ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌..

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శాఖలో భారీ చోరీ జరిగింది.

Update: 2024-11-19 07:04 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శాఖలో భారీ చోరీ జరిగింది. దొంగలు అత్యంత చాకచక్యంగా గ్యాస్ కట్టర్ సాయంతో కిటికీని కట్ చేసి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లలో భద్రపరచి ఉంచిన సుమారు 10 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన స్థానికుల మధ్య కలకలం రేపుతోంది. బ్యాంకు అధికారులు ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలు పరిశీలించడంతో పాటు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Similar News