కష్టాల కుప్పలు.. ధాన్యం తరలింపునకు లారీల కొరత..

కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు.

Update: 2023-05-28 17:00 GMT

దిశ, మల్హర్ : కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. లారీల కొరత ధాన్యం తరలింపునకు అవస్థలు పడుతున్నారు. కేంద్రాల్లో బార్దన సంచులు సరిపోను లేక కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు స్లోగా సాగుతున్నాయి. భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం విక్రయించేందుకు రైతులు ధాన్యం కుప్పల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. మండలంలో పీఎస్సీఎస్ 12, డీసీఎంఎస్ 9 చొప్పున ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యానికి నిర్వాహకుల అలసత్వంతో ధాన్యం కొనుగోళ్ళు మందకొడిగా సాగుతుండడంతో అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.

మరోవైపు బార్ధాన్ సంచలు కొరత తీవ్రం కావడం వల్ల ధాన్యం కొనుగోలు స్లోగా సాగుతున్నాయి. అధికారులు ఎలాంటి ప్రణాళికలు లేకుండా హడావుడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రం నిర్వాహకులు తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో లారీల కొరత ఏర్పడడంతో ట్రాన్స్పోర్ట్ లేక కేంద్రలోనే ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. రైస్ మిల్లుల అలాట్మెంట్ కేటాయించడంలో విఫలం చెందిన అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విక్రయించిన ధాన్యం బస్తాల వద్ద పడిగాపులు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారదన్ సంచుల కొరత తీవ్రమవడం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం రాశుల కుప్పలు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి.

మండుతున్న ఎండలు.. అన్నదాతల అవస్థలు

మండే ఎండలు రైతుల పడిగాపులు అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు. వర్షాలు కురిస్తే మా పరిస్థితి ఏంటి ? అధికారులు ఇంత నిర్లక్ష్యంగ వ్యవహరించడం పట్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నిర్వాహకుల కొనుగోలు చాకచక్యం లేకపోవడం కేంద్రాల్లో ధాన్యం నిలువలు పోటెత్తుతున్నాయి. తూకం వేసిన ధాన్యం బస్తాలు రవాణా మార్గం లేక కేంద్రాల్లోనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే వర్షం ప్రమాదం సంభవించే సమయం ఆసన్నమైంది. కేంద్రాలకు రోజుకు ఒకటి, రెండు వచ్చిన లారీలతో లోడింగ్ నిర్వహిస్తే తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని.

మండలనికి ఓకే రైస్ మిల్ అలాట్మెంట్ కేటాయించడం అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ధాన్యాన్ని నిర్వాహకులు కొనుగోలు చేస్తున్న తూకమైన బస్తాలను తలించడంలో ఒకటి, రెండు లారీలు రావడం కష్టంగా మారిందని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాకులు వాపోతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద భారీగా ధాన్యం నిల్వ ఉంది. రైతులు కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నారు. లారీలు, బార్ధాన్ సంచులు కొరత ఏర్పడడం రోజుకు ఇద్దరూ, ముగ్గురి రైతుల ధాన్యం కొనుగోలు చేస్తూ నిర్వాహకులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తూకం వేసిన ధాన్యం రైతుకు ట్రాక్ సీట్ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఎక్కడ చూసినా ఇలాంటి రైతుల ఆగచాట్లే దర్శనమిస్తున్నాయి.

Tags:    

Similar News