విద్యాలయాలు మందుబాబుల నిలయాలు..

జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్​​ గ్రామంలో విద్య, వైద్యాలయాలు

Update: 2024-07-02 11:37 GMT

దిశ,జనగామ : జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్​​ గ్రామంలో విద్య, వైద్యాలయాలు మందుబాబులకు నిలయాలుగా మారుతున్నాయి. గ్రామంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో యువకులు అక్కడ లిక్కర్​ కొనుక్కొని ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తున్నారు. గ్రామంలోని అంగన్​వాడీ సెంటర్​, ప్రభుత్వ పాఠశాల, పల్లె దవాఖాన ఆవరణలో సాయంత్రం అయ్యిందంటే చాలు మందుబాబులు దర్జాగా సిట్టింగ్​ చేస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి మందుబాబుల ఆగడాలకు చెక్​ పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News