రోడ్డు నిర్మాణం.. దుమ్ముతో ప్రజల పరేషాన్

కాటారం - మంథని ప్రధాన రహదారిలో మార్కెట్ కమిటీ నుంచి

Update: 2024-07-06 14:42 GMT

దిశ,కాటారం : కాటారం - మంథని ప్రధాన రహదారిలో మార్కెట్ కమిటీ నుంచి 7.30 కిలోమీటర్ల వరకు రోడ్డు నూతన రోడ్డు నిర్మాణం కోసంరూ. 32 కోట్లు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణం ఇటీవలే ప్రారంభించాగా కాంట్రాక్టర్ సరైన నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న మట్టి మొత్తం సుద్దగా ఉండడం సరైన రోలింగ్ చేయకపోతుండడంతో రోడ్డు పై నుంచి వస్తున్న వాహనాలు మార్గమధ్యంలోనే దిగబడి పోతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి గ్రానైట్ కంకర వినియోగించాల్సి ఉండగా గ్రానైట్ లోనే మరో రకం పింక్ కలర్ కంకర వినియోగి స్తుండడం విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ కాటారం నుండి అడవి సోమనపల్లి వరకు ఇదే కాంట్రాక్టర్ మద్య మద్యలో వివిధ పార్టీలుగా రోడ్డును నిర్మించారు. ఆ రోడ్డు అక్కడక్కడ అప్పుడే పూర్తిగా దెబ్బ తిన్నది రిపేర్లు లేవు. ఈ రోడ్డు నిర్మాణం కోసం మండలంలోని రెవెన్యూ రికార్డుల ప్రకారం ధన్వాడ శివారు, శంకరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 279 లో పెద్ద ఎత్తున మట్టి త్రవ్వకాలను జరుపుతున్నారు.


లావణ్య పట్టా కలిగిన ఈ భూమిని కొందరు సాగు చేసుకుంటుండగా మట్టి అవసరాల కోసం వారి వద్ద నుంచి సదరు కాంట్రాక్టర్ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదే భూమిలో ఏడాది పైగా రోడ్డు నిర్మాణం కోసం పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుపుతుండడంతో ఓపెన్ కాస్ట్ బొగ్గు బావుల ను ఈ ప్రదేశం తలపిస్తోంది. చుట్టూ వ్యవసాయ సేద్యం చేస్తున్న భూములు ఉండడం మధ్యలో రిజర్వాయర్ను తలపిస్తున్నట్లు ఉంది. ఇంత పెద్ద మొత్తంలో మట్టి తవ్వకాలను జరుపుతున్న సంబంధిత శాఖల అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ఎవరు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న రోడ్డుపై రోలింగ్ చేసే సమయంలో, కంకర నేర్పినప్పుడు రోడ్డుపై వాటరింగ్ చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ ఈ నిబంధనను విస్మరించడం తో వాహనాలు ప్రయాణం చేసినప్పుడు విపరీతమైన దుమ్ము వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పక్కన వ్యవసాయ భూములలో రైతులు పండిస్తున్న పంటపై దుమ్ము ధూళి ప్రభావం చూపుతోంది.


విద్యుత్ స్తంభాలకు పొంచి ఉన్న ప్రమాదం..

ధన్వాడ 279 సర్వే నెంబర్ శివారు (శంకరపల్లి గ్రామం ) భూముల నుంచి మొరం, మట్టి తవ్వకాలకు చేపడుతున్న నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ ను తలపిస్తోంది. ఆ ప్రాంతంలో పొరలు, పొరలుగా ఏర్పడి లోతైన ప్రాంతం గా మారడం వల్ల చుట్టూ ఉన్న వ్యవసాయ సేద్యానికి, భూములకు ఇబ్బందిగా మారుతోందని రైతాంగం గగ్గోలు పెడుతోంది. పశువులు, మేకలు, గొర్రెలు, ప్రమాదం లో మృత్యువాత పడే పరిస్థితి నెలకొన్నట్లుగా వారు వాపోయారు. కరెంటు స్తంభాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మీటర్ నిడివి మినహాయించుకుని చుట్టూ మట్టి తవ్వకాలు చేపట్టడం వల్ల కరెంటు పోల్ ఎప్పుడు కూలిపోతాయో అని భయాందోళనలు నెలకొన్నాయి. గాలి, వాన బీభత్సానికి కరెంటు స్తంభాలు కూలినట్లయితే గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం సంభవించనున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News