అడవి జంతువు రవాణా ముఠా గుట్టు రట్టు

పేకాట, ఆన్లైన్ గేమ్స్, రేషన్ బియ్యం, ఆన్లైన్ ఆప్, కోడి పందాలు,ఇసుక

Update: 2024-10-05 10:48 GMT

దిశ,కాటారం : పేకాట, ఆన్లైన్ గేమ్స్, రేషన్ బియ్యం, ఆన్లైన్ ఆప్, కోడి పందాలు,ఇసుక దందాకు నిలయమైన భూపాలపల్లి జిల్లాలో తాజాగా జంతువుల అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. కాటారం, మహా ముత్తారం మండలాల్లోని గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు, ఎరువుల దుకాణదారులు ఈ ముఠాలో నిందితులుగా ఉన్నారు. భూపాలపల్లి అటవీ శాఖ జిల్లా అధికారి వసంతం తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా అధికారులు ఈ ముఠాను పట్టుకున్నారు. సంఘటన ఈ ప్రాంతంలో జరగడంతో భూపాలపల్లి జిల్లా అటవీ శాఖకు అప్పగించారు.

భూపాలపల్లి జిల్లాలో అలుగు జంతువు విక్రయానికి సంబంధించి కొందరు ఆన్లైన్ లో పెట్టడంతో చెన్నైలోని వైల్డ్ లైఫ్ ట్రైన్ కంట్రోల్ బ్యూరో గుర్తించి వెంటనే ప్రాంతీయ ఉపసంచాలకుడు డాక్టర్ కృపా శంకర్, హనుమకొండ అటవీశాఖ వైల్డ్ లైఫ్ ట్రైన్ కంట్రోల్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎఫ్ఆర్ఓ బిక్షపతి, డీఆర్ఓ మోహన్, రతన్ లాల్, బలరామకృష్ణ కొనుగోలుదారులుగా వ్యూహం పన్ని స్మగ్లర్ల ను పట్టుకున్నారు. అడవి జంతువు ముడుచుకొని ఉన్నప్పుడు బుల్లెట్ దిగిన మరణించదని సమాచారం.దాని ధర ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు దీనిపై దృష్టి కేంద్రీకరించారు.

ఎనిమిది మంది నిందితులు..ఐదుగురి అరెస్ట్

అడవి జంతువు అక్రమ రవాణా కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులుగా తేలారు. వీరిలో ముగ్గురిని శుక్రవారం రాత్రి అటవీ శాఖ అధికారులు అరెస్టు చేయగా మరో ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన తాటి రాజకుమార్ (39), తాళ్లపల్లి శంకర్, ఇబ్రహీం పల్లి గ్రామానికి చెందిన అంజాద్ ఖాన్ (45),గారేపల్లి గ్రామానికి చెందిన ఊరుగొండ దేవన్న, మహాముత్తారం మండలంలోని ములుగు పల్లి గ్రామానికి చెందిన ఎరువుల దుకాణ వ్యాపారి గట్టు సమ్మయ్య(50),పెద్ద లక్ష్మయ్య , యామన్ పల్లి గ్రామానికి చెందిన ఎరువుల వ్యాపారి, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి నజీర్ (32),భూపాలపల్లి పట్టణానికి చెందిన నరివెద్ది వెంకట నారాయణ (50)లు నిందితులుగా ఉన్నారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా , కొత్తపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి శంకర్, పెద్ద లక్ష్మయ్య , గారెపల్లి గ్రామానికి చెందిన ఊరుగొండ దేవన్న నిందితులు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.


Similar News