రాష్ట్రంలో సర్వాంగ సుందరంగా ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పటిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
దిశ, దేవరుప్పుల: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పటిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండలంలోని మాదాపురం మండల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ. 22 లక్షల 16 వేలతో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించి గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాలలో స్థానిక సర్పంచ్ గుర్రం స్రవంతి కాంతి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్థాయి వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతోనే మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.
విద్యార్థుల డిమాండ్ మేరకు, హై స్కూల్ అభివృద్ధికి కూడా మరిన్ని నిధులు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈఓ రాము, డీఆర్డీఓ రాంరెడ్డి, ఎమ్మార్వో ఎడ్ల రవీందర్ రెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం జడ్పీటీసీ పల్లె భార్గవి సుందర్ రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చింత రవి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.