ప్రతి పల్లె ప్రగతిని సాధించడంలో జేపీఎస్ ల పాత్ర కీలకం.. రేణ్యాతండా సర్పంచ్

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతీ పల్లెల్లో ప్రగతికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులేనని, జేపీఎస్ లు చేస్తున్న నిరసనకు కొత్తగూడ మండలంలోని రేణ్యా తండాకి చెందిన అధికార పార్టీ సర్పంచ్ రమేష్ మద్ధతు తెలిపారు.

Update: 2023-04-29 14:59 GMT

దిశ, కొత్తగూడ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతీ పల్లెల్లో ప్రగతికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులేనని, జేపీఎస్ లు చేస్తున్న నిరసనకు కొత్తగూడ మండలంలోని రేణ్యా తండాకి చెందిన అధికార పార్టీ సర్పంచ్ రమేష్ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కార్యదర్శి ఉంటే అతనికి నాలుగు నుండి అయిదేసి గ్రామపంచాయతీలకు ఇంచార్జ్ కార్యదర్శులుగా ఉండేవారు. ఈ క్రమంలో సరైన పాలన అందేది కాదన్నారు.

నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె ప్రగతిని సాధించడంలో పంచాయతీ జూనియర్ కార్యదర్శుల పాత్ర కీలకంగా మారిందన్నారు. ఉద్యోగ క్రమబద్దీకరణ కోసం వారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్ధతు తెలియచేస్తున్నట్లు తెలిపారు. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారి హక్కులను కాపాడాలన్నారు. కేసీఆర్ వాళ్లకు తప్పక న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మద్ధతు తెలిపిన సర్పంచ్ కు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడాలని, ప్రభుత్వం స్పందించే విధంగా మాకు తోడుండాలని జేపీఎస్ లు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News