సర్పంచ్ నవ్యకు అండగా ఉంటాం.. బీజేపీ నాయకులు

జానకిపురం సర్పంచ్ నవ్యను పరామర్శించిన బీజేపీ నాయకులు మాజీ మంత్రి విజయరామారావు,

Update: 2023-03-11 10:58 GMT

దిశ, వేలేరు/ధర్మసాగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆయన అనుచరులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేసిన జానకిపురం సర్పంచ్ కుర్సపెల్లీ నవ్యను శనివారం బీజేపీ నాయకులు పరామర్శించారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు తదితరులు ఆమెను కలిసి ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంకిడి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ మోర్చా, పెద్దపల్లి జిల్లా ఇన్ ఛార్జి చిలుక విజయరావు, జిల్లా బీజేపీ నాయకులు బొజ్జపల్లి సుభాష్, అంజి రెడ్డి, మండల నాయకులు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News