మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలి: కలెక్టర్ దివాకర

మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలనీ,

Update: 2024-11-06 14:36 GMT

దిశ, ములుగు ప్రతినిధి: మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలనీ, అభివృద్ధి పనులలో నాణ్యతతో ఉంటేనే బిల్లుల చెల్లింపు జరుగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో ఐటీడీఏ అధికారులతో బిటి రోడ్లు, విద్య మౌలిక సదుపాయాలు, ఎన్ హెచ్ ఎం సబ్ సెంటర్లు, గ్రామ పంచాయతీ భవనాలు మరియు డి ఎం టి ఎఫ్ గ్రాంట్లు, అభివృద్ధి పనుల పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఐటీడీఏ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు, ఎన్ని గ్రౌండింగ్ అయినవి, పెండింగ్ ఎన్ని ఉన్నవి వాటికి గల కారణాలను తెలుసుకున్నారు.

మంజూరైన రోడ్ల పనులను నాణ్యత ప్రమాణాలు లోపించకూడ పూర్తి చేయాలని ఆదేశించారు.ఎంబి రికార్డు ప్రకారమే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, నాణ్యతతో లోపం ఉంటే బిల్లులలో కోతలు విధిస్తామని అన్నారు. పనులు నిర్దిష్ట గడువులోగా జరిగేలా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రౌండింగ్ కానీ పనులను టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 30 తేదీ లోపు పనులను ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశం లో ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రమ్, ఎస్ ఓ రాజ్ కుమార్, డి ఈ లు, ఏ ఈ లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News