కొత్త మండలంలో యువనాయకుడు సాయి జోష్..

నూతన మండలంగా ఏర్పాటైన గోరి కొత్తపల్లి మండలంలో కొత్త జోష్ మొదలైంది.

Update: 2023-11-25 09:42 GMT

దిశ, రేగొండ : నూతన మండలంగా ఏర్పాటైన గోరి కొత్తపల్లి మండలంలో కొత్త జోష్ మొదలైంది. మొన్నటి వరకు యువకుల్లో బీఆర్ఎస్ పార్టీ పై కొంత గందరగోళం నెలకొన్న ఇప్పుడు పూర్తి జోష్ తో యువత బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. దీనికి కారణం బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకులు సాంబారి సాయి అని కొందరు సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. కొత్త మండలంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు అటు ప్రజలను, ఇటు కార్యకర్తలను సమన్వయం చేసే దిశగా చూసారే కానీ కొత్త ఓటర్లను, యువతను ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీంతో కొందరు యువకుల్లో అసంతృప్తి నెలకొని ఇతర పార్టీల వైపు మొగ్గు చూపే పరిస్థితి నెలకొంది. యువతను ఆకర్షించే విధంగా వారి ఆలోచనలకు తగ్గట్టు వారిలో బీఆర్ఎస్ పై కొత్త ఉత్సాహం నింపేలా 500 ల బైకులతో గోరి కొత్తపల్లి మండలంలోని గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించి అందరి చూపు బీఆర్ఎస్ వైపు తిరిగేలా సాంబారి సాయి చేశాడని దీంతో యువకుల్లో కొత్త ఉత్సాహం పార్టీ పై పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేటీఆర్ బర్త్ డే వేడుకల్లోను సాయి మార్క్..

భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ బర్త్ డే వేడుకలను గతంలో ఎవరు చేయని విధంగా సాంబారి సాయి అత్యంత వైభవంగా రేగొండ మండల వ్యాప్తంగా డప్పు వాయిద్యాలు, కోలాటాలు, బాణాసంచాలతో కేటీఆర్ బర్త్ డే వేడుకను ఒక 1000 మందితో ర్యాలీ చేపట్టి ఫంక్షన్ హాల్ లో అందరికి భోజనాలతో ఘనంగా నిర్వహించి తన మార్క్ సెట్ చేశారు. అంతకు ముందు మండలంలోని పలు గ్రామాల్లో బలగం సినిమాను తన స్వంత ఖర్చులతో ప్రదర్శించి నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయని ఆలోచనతో యువకుల్లో బలమైన నాయకుడు గాను సాయి ఒక మార్క్ ట్రెండ్ ను సృష్టించుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పార్టీలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

గండ్రకు భారీ మెజారిటీ లక్ష్యం..

ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ చైర్ పర్సన్ గా సాంబారి సమ్మారావు అందరికీ సుపరిచితుడే. నేటి రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ములుగు నియోజకవర్గంలోని రెండు మండలాల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తూ సాంబారి సాయి గోరి కొత్తపల్లి మండలంలో బీఆర్ఎస్ యువ నాయకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తానికి మండల స్థాయి నాయకులకు, యువ నాయకుడు సాంబారి సాయి తోడు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని ప్రజలు చర్చజరుగుతుంది.

Tags:    

Similar News