వేం పురుషోత్తం రెడ్డికి రేవంత్ నివాళి..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసముద్రం మాజీ జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి సోదరుడు పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.
దిశ, హన్మకొండ టౌన్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసముద్రం మాజీ జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి సోదరుడు పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో వేం పురుషోత్తం రెడ్డి మరణించిన విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం వరంగల్‌లోని పురుషోత్తం రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
వేం పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వేం పురుషోత్తం రెడ్డి, ఆయన కుటుంబం తనకు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్లని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం ఎంతో బాధాకరమన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం జడ్పీటీసీగా పనిచేసిన పురుషోత్తం రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, వారి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. రేవంత్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి పరామర్శించిన వారిలో ఉన్నారు.