రియ‌ల్ ఢ‌మాల్‌.. నేల చూపులు చూస్తున్న రియల్ వ్యాపారం

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రియ‌ల్ భూం నేల చూపులు చూస్తోంది. రియ‌ల్ వ్యాపారం పై అనేక అనుమానాలు నెల‌కొన్నాయి.

Update: 2024-10-23 02:18 GMT

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రియ‌ల్ భూం నేల చూపులు చూస్తోంది. రియ‌ల్ వ్యాపారం పై అనేక అనుమానాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా వెంచ‌ర్ల ఏర్పాటుకు వ్యాపారులు సైతం వెన‌క‌డుగు వేస్తున్నారు. కాగా ఉన్న వెంచ‌ర్ల‌లో ప్లాట్ల అమ్మ‌కాల‌కు నానా యాత‌న ప‌డాల్సి వ‌స్తోందని వ్యాపారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రియ‌ల్ వ్యాపారం త‌గ్గుముఖం ప‌ట్టింద‌నడానికి ఆయా రిజిస్ట్రేష‌న్ల కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న డాక్యుమెంట్ల‌ే నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరంగ‌ల్‌, హ‌న్మ‌కొండ, కాజీపేట‌ల‌తో పాటు జిల్లా కేంద్రాలైన మ‌హ‌బూబాబాద్‌, జ‌న‌గామ‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలైన ప‌ర‌కాల‌, న‌ర్సంపేట‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, పాల‌కుర్తి నియోజకవర్గంలో ప్ర‌ధాన‌ప‌ట్ట‌ణంగా ఉన్న తొర్రూరులోనూ రియ‌ల్ భూం స్త‌బ్ద‌త కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో రియ‌ల్ ఎస్టేట్‌లో రూ.కోట్లు కుమ్మ‌రించిన వ్యాపారులు, ప‌ట్ట‌ణాల్లో నిర్మాణాలు చేప‌ట్టి అమ్మ‌కాల కోసం బిల్డ‌ర్లు ఎదురు చూస్తున్నారు. గ‌తేడాదితో పోల్చితే భూ లావాదేవీలు త‌గ్గుతుండ‌డమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రియ‌ల్‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తక్కువ ధరకు ఇస్తామన్నా ప్లాట్లు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేద‌ని బిల్డ‌ర్లు, రియ‌ల్ వ్యాపారులు వాపోతున్నారు. తాము వడ్డీకి అప్పులు తెచ్చి అపార్ట్‌మెంట్లు నిర్మించామని, ఇప్పుడు కొనుగోలు చేసే వారు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : అనేక కార‌ణాల‌తో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రియ‌ల్ భూం నేల చూపులు చూస్తోంది. రియ‌ల్ వ్యాపారం పై అనేక అనుమానాలు నెల‌కొన్న నేప‌థ్యంలో కొత్త‌గా వెంచ‌ర్ల ఏర్పాటుకు వ్యాపారులు సైతం వెన‌క‌డుగు వేస్తుండ‌గా ఉన్న వెంచ‌ర్ల‌లో ప్లాట్ల అమ్మ‌కాల‌కు నానా యాత‌న ప‌డాల్సి వ‌స్తోందంటూ వ్యాపారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రియ‌ల్ వ్యాపారం త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని చెప్ప‌డానికి ఆయా రిజిస్ట్రేష‌న్ల కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న డాక్యుమెంట్ల‌ను ఆధారంగా చెబుతున్నారు. ఇక వరంగ‌ల్‌, హ‌న్మ‌కొండ, కాజీపేట‌ల‌తో పాటు జిల్లా కేంద్రాలైన మ‌హ‌బూబాబాద్‌, జ‌న‌గామ‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలైన ప‌ర‌కాల‌, న‌ర్సంపేట‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, పాల‌కుర్తి నియోజకవర్గంలో ప్ర‌ధాన‌ప‌ట్ట‌ణంగా ఉన్న తొర్రూరులోనూ రియ‌ల్ భూం స్త‌బ్ద‌త కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో రియ‌ల్ ఎస్టేట్‌లో రూ.కోట్లు కుమ్మ‌రించిన వ్యాపారులు, ప‌ట్ట‌ణాల్లో నిర్మాణాలు చేప‌ట్టి అమ్మ‌కాల కోసం బిల్డ‌ర్లు ఎదురు చూస్తున్నారు. గ‌తేడాదితో పోల్చితే భూ లావాదేవీలు త‌గ్గుతుండ‌డమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రియ‌ల్‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల‌తోపాటు జిల్లా కేంద్రాలైన జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్‌, ములుగు, భూపాల‌ప‌ల్లి ప‌ట్ట‌ణాల్లోనూ అనేక అపార్ట్‌మెంట్లు కొనేవారు లేక ఖాళీగా ఉన్నాయి. తక్కువ ధరకు ఇస్తామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేద‌ని బిల్డ‌ర్లు, రియ‌ల్ వ్యాపారులు వాపోతున్నారు. తాము వడ్డీకి అప్పులు తెచ్చి అపార్ట్‌మెంట్లు నిర్మించామని, ఇప్పుడు కొనుగోలు చేసే వారు లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

త‌గ్గిన రిజిస్ట్రేష‌న్‌శాఖ ఆదాయం...

రిజిస్ట్రేష‌న్ల శాఖకు ఆదాయం త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌తేడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు 14 శాతం ఆదాయం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. 2023లో ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు మొత్తం

54,929 రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌గా రూ.193.48 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. అలాగే 2024 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబ‌ర్ 30వ‌ర‌కు ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల్లో 54,806 రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌గా సుమారు 166.20కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. అంటే గ‌తేడాది గ‌ణాంకాల‌తో పోల్చిన‌ప్పుడు రూ.27,28,11,000 ఆదాయం త‌గ్గింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈసారి ఆశించిన ఆదాయాన్ని ఆర్జించడం లేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మొత్తం వ‌రంగ‌ల్ ఆర్వో ఆఫీసుతో క‌లుపుకుని మొత్తం 13 కార్యాల‌యాలు ఉండ‌గా, గ‌త ఏడాదితో పోల్చిన‌ప్పుడు ఏ కార్యాల‌యంలోనూ రిజిస్ట్రేష‌న్ల సంఖ్య మెరుగ్గా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రియల్ రంగంలోనూ స్థబ్ధత..

మొత్తానికి, గత కొంతకాలం నుంచి హైదరాబాద్ తరహాలో వరంగల్ రియల్ రంగంలోనూ స్థబ్ధత నెలకొన్నది. ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరగకపోయినా, కొందరు డెవలపర్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం విడ్డూరమనిపిస్తోంది. మరికొందరేమో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక సతమతం అవుతున్నారు. ఆరు నెలల నుంచి అమ్మకాలు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. డిమాండ్ లేక‌పోవ‌డంతో జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలో కొత్త‌గా వెంచ‌ర్ల ఏర్పాటు కూడా కనపించడం లేదు. దీంతో పాత రిజిస్ట్రేష‌న్లకు సంబంధించిన క్ర‌యవిక్ర‌యాలు జ‌రుగుతున్నాయే త‌ప్పా.. కొత్త‌గా న‌గ‌ర శివారుల్లో రియ‌ల్ భూం లేద‌న్న అభిప్రాయం రియ‌ల్ వ్యాపారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేస‌న్ల శాఖ అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక సెమీ అర్భ‌న్‌గా ఉన్న ప్రాంతాల్లో అయితే రియ‌ల్ భూం ఆవిరైంద‌నే చెప్పాలి.



 



Similar News