కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఒకే చోట నిర్వహించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మండలంలోని బయ్యారం, కొత్తపేట, కోట గడ్డ, నామలపాడు పంచాయతీ

Update: 2024-12-31 06:48 GMT

దిశ,బయ్యారం : మండలంలోని బయ్యారం, కొత్తపేట, కోట గడ్డ, నామలపాడు పంచాయతీ పరిధిలోని పీఎసీఎస్ ,ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది రికార్డులను పరిశీలించి ధాన్యం కొనుగోలు బస్తాల నిలువలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రెండు మూడు నిర్వహించడంపై కలెక్టర్ అక్కడ నిర్వాహకులను మందలించినట్లు రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఒకే చోట నిర్వహించాలని రైతులకు ఇష్టమున్నచోట కేంద్రాలంటూ ధాన్యం నిలువలను చేయరాదని సూచించారు.

సెంటర్లో 2000 ధాన్యం గన్నీ బస్తాలు నిల్వలు ఎక్కడ అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. మరోసారి ధాన్యం కొనుగోలు కేంద్రం ఒకే చోట ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులు ఇష్టమున్నచోట కేంద్రాలు అంటూ ప్రచారం చేయరాదని వారిని మందలించినట్లు సమాచారం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ధాన్యం ఎప్పటికప్పుడు మ్యాచ్చరు 16,17 శాతం వచ్చిన వాటిని గుర్తించి ,హమాలీలతో కాంటాలు నిర్వహించి, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం లారీల ద్వారా మిల్లర్లకు తరలించాలని తహశీల్దార్ బి. విజయను ,కొనుగోలు నిర్వహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ఆర్ఐ నారాయణ,కలెక్టర్ పీఆర్ఓ అశోక్ , కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సతీష్ ,గణేష్ ,వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


Similar News