ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి : వరంగల్ సీపీ
పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద
దిశ,హన్మకొండ : పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ విభాగంలో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి సోమవారం పదవీవిరమణ చేస్తున్న పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పదవీవిరమణ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గోని, పదవీవిరమణ చేస్తున్న ఎస్సైలు వెంకటేశ్వర్లు, రవి, యాదగిరి, ఎ ఎస్సైలు సాంబయ్య, ప్రభాకర్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాతుడుతూ సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేయడంమే కాకుండా క్లిష్టసమయాల్లో విధులు నిర్వహించి నేడు శాంతియుతమైన వాతావరణం కల్పించడంలో, వీరు ప్రధాన కారకులని, నేటి తరం పోలీసులకు వీరు స్పూర్తిగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమములో అదనపు డీసీపీ సురేష్కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్, ఆర్ఐలు శ్రీధర్,చంద్రశేకర్, ఆర్ ఎస్సైశ్రవణ్ కుమార్,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్కుమార్తో పాటు పదవీవిరమణ పోందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గోన్నారు