జాతీయ కార్మికుల కోరికల దినోత్సవాన్ని జయప్రదం చేయండి : సీఐటీయు జిల్లా కార్యదర్శి

కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు

Update: 2024-07-05 13:31 GMT

దిశ,హన్మకొండ : కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు జూలై 10న జాతీయ కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రాలలో జరిగే ధర్నాలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హన్మకొండ రాంనగర్ లోని సుందరయ్య భవన్ లో టీ.ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి గత పది సాగించుకున్న ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బొగ్గు గనుల ప్రైవేటీకరణకు పూనుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తాము అని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది వాటిని తిప్పికొడుతామని అన్నారు. కార్మికులకు కనీస వేతన 26 వేల రూపాయలు ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పర్మినెంట్, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లాంటి వాటి సాధనకు పోరాటాలు ఉదృతం చేయాలనీ కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు దాటింది అని, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు కానీ కార్మికుల కనీస వేతనాల ఊసే లేదన్నారు. పైగా అంగన్వాడీలను అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి అన్యాయంగా ఇంటికి పంపిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా ఎండగట్టాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా ఆఫీస్ బేరర్స్ గాదె ప్రభాకర్ రెడ్డి బొట్ల చక్రపాణి పుల్ల అశోక్ పెండ్యాల రవి బొల్లారపు సంపత్ రజిత జిల్లా కమిటీ సభ్యులు యాకయ్య బానోతు వెంకన్న పల్లె రామన్న రాజేష్ కే జమున కే రమాదేవి యన్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.


Similar News