నిర్వీర్యమైన నిఘా.. పని చేయని సీసీ కెమెరాలు

కేసముద్రం మండలం లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

Update: 2024-09-07 11:18 GMT

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలం లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నామ మాత్రంగా ఉన్నాయి. గతం లో ఒక ఎస్ ఐ పట్టణ కేంద్రం లో ప్రముఖుల, దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి నిర్వహణ సరిగా లేక అవి పని చేయడం లేదు. దీంతో నేరాలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడం సమస్యగా మారింది. నేరస్థులు కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని విచ్చల విడి దొంగతనాలకు తెగపడుతున్నారు. ఇటీవల దొంగతనాలు ఎక్కువ అవడం తో నిఘా వ్యవస్థ లోపం వలన నిందితులను పట్టుకోలేక పోతున్నారు. గత నెలలో ఉప్పరపల్లి లో దొంగతనం జరుగగా ఇప్పటి వరకు దొంగలు దొరకలేదు. అంటే అది సీసీ కెమెరాలు పని చేయక పోవటం కారణంగా ప్రజలు అంటున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చోరీ కేసులు ఎక్కువ అయితే పై అధికారుల ఒత్తిడి వుంటున్నదని కొన్ని దరఖాస్తుల కే పరిమితం అవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో ఒక బాలుడు ఒక చిరు దుకాణం లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ దొరికిపోగా అతడిని పట్టుకుని పోలీసులకు అప్ప చెబితే కనీసం చిన్న మందలింపు లేదు. పోయిన డబ్బులు రికవరీ లేకపోవడం లో మతలబు ఏమిటో అని ఆ చిరు వ్యాపారి ప్రశ్నిస్తున్నాడు. చిన్నతనం లో సులభ డబ్బులకు అలవాటు పడి చిరు దుకాణం లలో దొంగతనానికి పాల్పడే చిన్నారులను అడ్డు చెప్పక పోతే రేపు గజదొంగలు గా మారి సమాజానికి చీడ పురుగులు గా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేసముద్రం మండల కేంద్రం లో అన్ని సీసీ కెమెరాలు పని చేసే విధంగా చూడాలని, నేరాలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News