Bhupalpally MLA : ఇల్లీగల్ వ్యాపారాలు నడిపే దొంగలను క్షమించ వద్దు..
ఇల్లీగల్ వ్యాపారాలు నడిపే దొంగలను క్షమించ వద్దని, ప్రజలకు
దిశ, శాయంపేట : ఇల్లీగల్ వ్యాపారాలు నడిపే దొంగలను క్షమించ వద్దని, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే క్షమించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఉన్నారు. మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల స్పెషలాఫీసర్లు, అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీలు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో సమస్యలపై గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయాలన్నారు. ఫలానా వ్యక్తి సర్పంచ్ చేయని పని స్పెషల్ ఆఫీసర్ చేసిండు అని పేరు తెచ్చుకోవాలన్నారు. పేరుకే స్పెషలాఫీసర్ అన్నది కాకుండా బాధ్యతయుతంగా పనిచేయాలన్నారు. మండలంలో క్రషర్లు ఉన్నవి డస్ట్ కావాలంటే క్రషర్ల నుండి ఫ్రీగా తెప్పించుకోండి ఒకవేళ ఇవ్వకపోతే క్రషర్ సీజ్ చేస్తామని చెప్పండి. వాడు ఫ్రీగా నాలుగు ట్రిప్పర్ల డస్ట్ పోస్తాడు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత శాయంపేట గుట్టల్లో ఉన్నటువంటి ఆరూరి రమేష్, బాలాజీ మరియు వెంకటేశ్వర క్రషర్లపై 112 కోట్ల రూపాయల నోటీసులు ఇప్పిచ్చినమని, ఇంకొకటి 79 కోట్లకు నోటీసులు ఇప్పిచ్చినమని అన్నారు.
ఈ డబ్బు కట్టకపోతే క్రషర్ సీజ్ చేపిస్తామని అన్నారు. ఆరూరి రమేష్ భార్య పేరు మీద ఉన్న క్రషర్ను సీజ్ చెప్పిచ్చిన అని, మిగతా వాళ్ళు డబ్బు కట్టకపోతే అవి కూడా సీజ్ అవుతాయని మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుపుతున్నారన్నారు. పన్నులు పెంచే అధికారం సర్పంచ్ కి ఉంటదని, క్రషర్ల మీద నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్లకు చెప్పారు. శాయంపేట క్రషర్ల మీద స్వయంగా ముఖ్యమంత్రి నాతో మాట్లాడిండని దానిమీద నోటీసులు కూడా ఇప్పిచ్చినామని దాని నుంచి కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారని స్టేను కూడా వేకెట్ చేపిస్తున్నామని అన్నారు. క్రషర్ నుంచి వచ్చే శబ్దాలకు పక్కన ఉన్న తహరాపూర్, మాందారి పేట స్కూలు, ఇల్లు బద్దలవుతున్నాయని ఉన్నారు. ఇలాంటివి జరగకుండా స్పెషల్ ఆఫీసర్ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఇల్లీగల్ దందా నడిపి 100 సంవత్సరాలకు సరిపడా సంపాదించుకున్నారు అని అన్నారు. మండలంలో మైనింగ్ అంతా దుర్వినియోగం అవుతుందన్నారు.కనుక మనం నోటీసులు ఇస్తే మన వెనుక తిరుగుతుంటారని అధికారాన్ని ఏమీ చేయకుండా ఉంటే చాతకానోన్ని లెక్క ట్రీట్ చేస్తుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.