Nannapuneni Narender : ప్రజా సమస్యల పరిష్కారంపై మేయర్‌ పక్షపాత వైఖరి

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జీడబ్ల్యూఎంసీ అధికారుల

Update: 2024-09-18 13:02 GMT

దిశ,వరంగల్‌ టౌన్ : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జీడబ్ల్యూఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు మేయర్‌ గుండు సుధారాణి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వరంగల్‌ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ విమర్శించారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఎదుట 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ప్రజా నిరసన దీక్షకు మాజీ ఎమ్మెల్యే సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 40వ డివిజన్‌లో సరైన మౌలిక వసతులు, అభివృద్ధి చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై బల్దియా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రజల పక్షాన నిలబడతామన్నారు.

బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. డిప్యూటీమేయర్‌ రిజ్వానా షమీమ్‌ మసూద్‌ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు రోడ్డెక్కారని, ఇప్పటికైనా అన్ని డివిజన్లను మేయర్‌ సమదృష్టితో చూడాలన్నారు. ఈ దీక్షకు సంఫీుభావం తెలిపిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ తోట వెంకన్న, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, ఆవాల రాధికా రెడ్డి, గుగులోత్‌ దివ్యరాణి రాజు నాయక్‌, సిపిఎం నాయకులు సింగారబాబు, బిజెపి నేత ఎడ్ల అశోక్‌ రెడ్డి, పుల్లారావు, తాబేటి వెంకట్‌ గౌడ్‌, నాయకులు ఆకుతోట రాజు, పూజారి విజయ్‌, వనం కుమార్‌, మరుపల్ల గౌతమ్‌, కుండె రాజు, బొల్లం యాకయ్య, మిర్యాల కుమార స్వామి, దార్ల రాజేశ్వర్‌, పోలేపాక రాజన్‌ బాబు, మేకల శరబంధం, పసునూరి రమేష్‌, మేకల రవి, మంద నవీన్‌ ఉన్నారు.


Similar News