నాసిరకమైన భోజనం వడ్డిస్తే కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్ రాహుల్ శర్మ

మండలంలోని ప్రభుత్వ, ఆదర్శ, హాస్టల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థిని విద్యార్థులకు వడ్డించే భోజనం పుష్టికరంగా ఉండాలని సూచిస్తూ నాసిరకంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.

Update: 2024-11-28 14:09 GMT

దిశ, మల్హర్ : మండలంలోని ప్రభుత్వ, ఆదర్శ, హాస్టల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థిని విద్యార్థులకు వడ్డించే భోజనం పుష్టికరంగా ఉండాలని సూచిస్తూ నాసిరకంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. గురువారం మండలంలో విస్తృత పర్యటన చేస్తూ కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ముచ్చటించారు. రోజు వడ్డిస్తున్న భోజన నాణ్యత పై ఆరా తీసి వంట సామాగ్రి, కిచెన్ షెడ్, కూరగాయలు, పప్పు బియ్యంలను పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలి. వంటశాల ప్రదేశం, వంట పాత్రలు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం మండల అధికారులు మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం వడ్డించే భోజనాన్ని పక్కాగా పరిశీలించాలని తెలిపారు.

అనంతరం తాడిచర్ల, పెద్దతుండ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రానికి వచ్చిన ధాన్యం వేగంగా కొనుగోలు చేసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు ఆదేశించారు. రైతులు విక్రయించిన ధాన్యం డబ్బులు వారి ఖాతాలో వెంటనే జమ అయ్యేలా చూసుకోవాలని పీఎస్సీ ఎస్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా 41 కిలో తూకం వేసిన ధాన్యం, బస్తా ప్యాడి క్లీనర్ లేకుండా కొనుగోలు చేయాలని లేదంటే ప్యాడి క్లీనర్ చేస్తే 40.650 గ్రాముల తూకంతో ధాన్యం కొనుగోలు చేయాలని పక్కన ఉన్న పెద్దపల్లి జిల్లాలో ఇదేవిధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే చర్యలు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కుల గణన, కుటుంబ సర్వే డేటా ఎంట్రీ చేస్తున్న పనితీరును పరిశీలన చేస్తూ తప్పులు లేకుండా డాటా ఎంట్రీ త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు.

గ్రంధాలయ భవనాన్ని, సహకార సంఘ భవన ఆవరణలో నిర్మిస్తున్న ప్రహరీని పరిశీలిస్తూ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఆయన వెంట తహశీల్దార్ రవికుమార్, ఎంపీడీవో శ్యాంసుందర్, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News