ఏసీబీ వలలో పీఆర్ ఏఈ..
అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు.
దిశ, హనుమకొండ : అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రభుత్వ శాఖల్లో లంచావతారాలను వలపన్ని పట్టుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఇంజనీర్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఏఈ కార్తీక్ రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
కాంట్రాక్టు బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్ వద్ద సతీష్ నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏఈ కార్తీక్ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు. అనంతరం హన్మకొండ లోని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.