కాకతీయ కెనాల్‌కు పొంచి ఉన్న ప్రమాదం
40 ఏళ్ల కింద కాకతీయ కెనాల్ పనులు చేపట్టారు.
దిశ,సంగెం : 40 ఏళ్ల కింద కాకతీయ కెనాల్ పనులు చేపట్టారు. సిమెంట్ లైనింగ్, సైడ్ లైనింగ్ పనులు చేపట్టి రైతులకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం కాకతీయ కెనాల్ ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు. కాకతీయ కెనాల్ కాలువకు సిమెంట్ లైనింగ్, దెబ్బ తినడం జరిగింది. సంగెం మండలంలోని వెంకటాపురం నుంచి కుంటపల్లి మధ్య కైటెక్ వస్త్ర పరిశ్రమ వెనుక ఉన్న కాకతీయ ప్రధాన కాలువకు సైడ్ లైనింగ్ దెబ్బతిని, కాలువ కోతకు గురై ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువలోకి నీటిని వదలక ముందే చర్యలు చేపట్టాలని అన్నారు.కాలువ దెబ్బతిన్న పనులు చేయకుండా నీటిని వదిలితే కాలువ కోతకు గురై జరగరానిది ఏదైనా సంభవిస్తే జరిగే ప్రమాదం కాకతీయ వస్త్ర పరిశ్రమకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఎస్సారెస్పీ అధికారులు నిర్లక్ష్యం వీడి కాలువ వెంబడి పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.